కరోనా వైరస్ ప్రభావముతో ప్రపంచం చిగురుటాకులాగా వణుకుతున్న విపత్కర పరిస్థితిలోనూ వర్గ పోరు ఆపడం లేదు మావోయిస్టులు.ఛత్తీస్గఢ్ అడవులలో మళ్లీ రక్తపు టేరులు పారించారు.శనివారం మధ్యాహ్నం సుక్మా అడవులలో ఎదురు కాల్పుల సంఘటన తర్వాత అదృశ్యమైన 17 కోబ్రా దళ సిబ్బంది మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అధునాతన డ్రోన్ల సహాయంతో సుక్మా అడవినీ జల్లెడ పట్టడంతో ఈరోజు మధ్యాహ్నం వీరి మృతదేహాలు కనిపించాయి.మావోయిస్టులతో జరిగిన ఎన్కౌంటర్లో వీరు చనిపోయారని ఛత్తీస్గఢ్ పోలీస్ అధికారులు వెల్లడించారు. మృతులలో ముగ్గురు […]