విభిన్నమైన సినిమాలు, పాత్రలు చేస్తూ కొత్తదనానికి పెద్ద పీట వేసే స్టార్ హీరో విక్టరీ వెకంటేశ్… ఫిదా, తొలి ప్రేమ చిత్రాలతో వరుస విజయాలను సాధించిన యువ కథానాయకుడు వరుణ్ తేజ్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ రూపొందనుంది. ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో రూపొందనున్న ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించనున్నారు. […]