దేవినేని ఉమామహేశ్వరరావు.. పరిచయం అక్కర్లేని పేరు. వైఎస్ జగన్పైనా, వైసీపీ ప్రభుత్వంపైనా ఒంటికాలిపై లేస్తుంటారు. సవాళ్లు చేస్తూ హల్చల్ చేస్తుంటారు. నిత్యం ప్రభుత్వంపై విమర్శలు, అధికార పార్టీ నేతలపై ఆరోపణలు చేసే మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు.. వైసీపీ నేతలకు అడ్డంగా దొరికిపోయారు. సీఐడీ విచారణకు వరుసగా రెండోసారి డుమ్మా కొట్టి విమర్శలపాలవుతున్నారు. సద్విమర్శలు ప్రజాస్వామ్యంలో సర్వసాధారణం. అక్రమాలు, అవినీతిపై ఆధారసహితంగా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే బాధ్యత ప్రతిపక్షానిది. కానీ ఆధారరహితంగా. పనికట్టుకుని బురదజల్లే తీరు వల్ల […]