చైనా, అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, కెనడా దేశాల్లోలాగా కరోనా వైరస్ భారత్లో విజృంభించి ఉంటే మన పరిస్థితి ఏమిటి..? అభివృద్ధి చెందిన ఆయా దేశాలే కరోనా వైరస్ను కట్టడి చేయలేక, బాధితులకు వైద్య సదుపాయాలు అందించలేక అతలాకుతలం అవుతున్నాయి. ఆరు కోట్ల జనాభా ఉన్న ఇటలీ చిగురుటాకులా వణికిపోతోంది. మరి 130 కోట్ల జనాభా ఉన్న భారత్ను ఆ స్థితిలో ఊహించుకుంటేనే ఒళ్లుజలదరిస్తోంది. కొంత మంది అనుకుంటున్నట్లు పుణ్యఫలమో, దైవ బలమో లేదా ప్రభుత్వాల ముందు […]