దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. కొత్తగా కరోనా బారినపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరిచేస్తూ రూల్ తీసుకొచ్చింది. బుధవారం నుంచి ఈ నిబంధన అమలు చేయాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (డీడీఎమ్ఏ) ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ పెట్టుకోని వారికి రూ.500 జరిమానా విధించాలని కూడా నిర్ణయించింది. […]
70 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని తాము ఐదేళ్లలో చేశామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. అందుకే తమ ప్రభుత్వంపై ఢిల్లీ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. నిన్న నామినేషన్ల చివరి రోజున కేజ్రీవాల్ న్యూఢిల్లీ శాసన సభకు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్ పై విధంగా వ్యాఖ్యానించారు. ఢిల్లీ ప్రజలతోపాటు ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు కూడా తమకు ఓట్లు వేయాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. వేరే పార్టీ […]
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ న్యూ ఢిల్లీ అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు లో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన మంగళవారం మధ్యాహ్నం కేజ్రీవాల్ కుటుంబ సభ్యులతో కలిసి జామ్నగర్ హౌస్ ఎన్నికల కార్యాలయానికి వచ్చారు. తాము నామినేషన్ పత్రాలు ఇచ్చేదాకా ఆయన్ను వెళ్లనిచ్చేది లేదని అప్పటికే భారీ సంఖ్యలో అక్కడున్న అభ్యర్థులు పట్టుబట్టారు. దీంతో నిబంధనల ప్రకారం కేజ్రీవాల్ టోకెన్ తీసుకున్నారు. ఆయన టోకెన్ నంబర్..45. మధ్యాహ్నం మూడు గంటల్లోగా వచ్చిన […]
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తఢిల్లీ శాసనసభా స్థానం నుంచి బరిలోకి దిగుతున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ వాల్ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. సోమవారం కుటుంబంతో కలిసి వాల్మీకి ఆలయాన్ని దర్శించుకున్న కేజ్రీవాల్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్నారు. వారితోబాటు రిటర్నిింగ్ ఆఫీసర్ కార్యాలయానికి సాయంత్రం 3 గంటలలోపు చేరుకోవాల్సి ఉంది.ఆలోపు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉన్నప్పటికీ ర్యాలీలో చిక్కుకుని ఆ సమయంలోగా ఆర్వో కార్యాలయానికి చేరుకోలేకపోయారు. దీంతో ఆయన ఇంటికి వెనుదిరగాల్సి వచ్చింది. ఫిబ్రవరి 8న […]
మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దారుణమైన ఘటనలను నివారించటానికి కఠినమైన చట్టాలు అవసరమని భావించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన దిశ చట్టం అసెంబ్లీలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. మహిళలపై నేరాలకు పాల్పడిన వారిపై కేసు నమోదైన తరువాత కంక్లుజివ్ ఎవిడెన్స్ ( బలమైన సాక్ష్యాలు) ఉంటే 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి 21 రోజుల్లో శిక్ష పడేలా ఈ బిల్లు రూపోందించారు. అలాగే సోషల్ మీడియాలో మహిళలపై వేధింపులకు దిగితే మొదటిసారి 2 […]