అక్కడ ఉన్నది పది వార్డులు.. గెలిచింది స్వతంత్రుడితో కలుపుకొని ఏడు పార్టీలు… “అమరచింత” పాత సంస్థానం ..2009 పునః విభజనలో ఈ నియోజకవర్గం రద్దు అయ్యి కొత్తగా దేవరకద్ర ఏర్పడింది. కానీ అమరచింత మండలం మక్తల్ నియోకవర్గంలో కలిసిపోయింది. అప్పట్లో అమరచింత అంటే కొత్తకోట దయాకర్ రెడ్డి అన్నంతగా ఆయన ఆధిపత్యం ఉండేది. కొత్త కోట దయాకర్ రెడ్డి పూర్వికులు అమరచింత సంస్థాన్ దివాన్ గా ఉండేవారు.