తిరుపతి ఉప ఎన్నికలపై స్పష్టత వచ్చేస్తోంది. బీజేపీ అభ్యర్థి కూడా దాదాపు ఖారరయినట్టు కనిపిస్తోంది. మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాస్ ని బరిలో దింపేందుకు సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు. దాంతో జనసేనకు మరోసారి మొండిచేయి తప్పలేదు. గ్రేటర్ నామినేషన్లు వేసిన తర్వాత ఉపసంహరించుకున్న జనసేనకు ఏపీలో కూడా పోటీకి ముందే బరిలోంచి తప్పుకోవాల్సి వస్తోంది. ఏకంగా నడ్డాని కలిసి విన్నవించినా పవన్ పట్ల తమకు విశ్వాసం లేదన్నట్టుగా బీజేపీ సంకేతాలు ఇచ్చేసింది. పార్లమెంట్ బరిలో తామే దిగుతామని […]