రాయలసీమలోని కర్నూలు జిల్లా రైతాంగం ఆనందంలో ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ కల నెరవేరబోతోందని సంబరపడుతున్నారు. సాగు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా వైసీపీ తీసుకుంటున్న చర్యలతో తమ అభివృద్దికి అడుగులు పడ్డాయంటున్నారు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమంటే కోడుమూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు ప్రాంతాలు. వెనుకబడిన ప్రాంతాలైన పత్తికొండ, కోడుమూరు, డోన్ నియోజకవర్గాల్లో రైతులను దృష్టిలో ఉంచుకొని దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 1960లో హంద్రీనదికి ఉపనది అయిన ఇంద్రావతి వాగుపై […]