తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం (91) కన్నుమూశారు. బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు.వయోభారంతో పాటు ఊపిరితిత్తుల సమస్యతో దీర్ఘకాలంగా బాధపడుతున్న ఆమె ఈ నెల రెండో తేదీ నుంచి హైదరాబాద్లోని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆమెకు ఐసీయూలో వెంటిలేటర్పై డాక్టర్లు చికిత్స అందిస్తుండగా ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు. 1931లో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం లో జన్మించిన ఆమె […]