మాజీ శాసనసభ్యుడు, ప్రముఖ కమ్యూనిస్టు నేత కాకర్లపూడి సుబ్బరాజు మృతి చెందారు. విజయవాడ నగర పాలక సంస్థలో సుదీర్ఘ కాలం వివిధ హోదాల్లో పనిచేసిన సుబ్బరాజు 1994లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. శాసనసభ్యునిగానూ, అంతకు ముందు విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా, ప్రతిపక్ష నేతగా సుబ్బరాజు నగరాభివృద్ధికి విశేష కృషి చేశారు. నగరంలో కమ్యూనిస్టుల ప్రాభల్యం ఎక్కువగా ఉన్న రోజుల్లో ఉభయ కమ్యూనిస్టులు ఐక్యంగా పనిచేస్తున్న రోజుల్లో సుబ్బరాజు నగర […]