దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. కొత్తగా కరోనా బారినపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరిచేస్తూ రూల్ తీసుకొచ్చింది. బుధవారం నుంచి ఈ నిబంధన అమలు చేయాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (డీడీఎమ్ఏ) ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ పెట్టుకోని వారికి రూ.500 జరిమానా విధించాలని కూడా నిర్ణయించింది. […]