దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా మహమ్మారి దరి చేరకుండా ఉండాలంటే.. కచ్చితంగా మార్గదర్శకాలను పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల్లో ఎక్కువగా తేలికపాటి లక్షణాలు కనిపిస్తున్నాయని వివరిస్తున్నారు. కరోనా తన రూపు మార్చుకుంటూ కొత్త కొత్త వేరియంట్లతో ప్రజలపై విరుచుకుపడుతోంది. కాబట్టి ఇఫ్పటికైనా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇటీవల అతిసారం కరోనా లక్షణంగా కనిపిస్తోందని ఢిల్లీలోని అపోలో హాస్పిటల్ కు చెందిన సీనియర్ […]