Idream media
Idream media
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా మహమ్మారి దరి చేరకుండా ఉండాలంటే.. కచ్చితంగా మార్గదర్శకాలను పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల్లో ఎక్కువగా తేలికపాటి లక్షణాలు కనిపిస్తున్నాయని వివరిస్తున్నారు. కరోనా తన రూపు మార్చుకుంటూ కొత్త కొత్త వేరియంట్లతో ప్రజలపై విరుచుకుపడుతోంది. కాబట్టి ఇఫ్పటికైనా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇటీవల అతిసారం కరోనా లక్షణంగా కనిపిస్తోందని ఢిల్లీలోని అపోలో హాస్పిటల్ కు చెందిన సీనియర్ వైద్యుడు డాక్టర్ మోదీ చెబుతున్నారు. గత పది రోజుల్లో కరోనాకేసుల సంఖ్య వేగంగా పెరిగింది. అయితే చాలా కేసుల్లో తేలికపాటి లక్షణాలు కనిపిస్తున్నాయని డాక్టర్ మోదీ తెలిపారు. ప్రస్తుతం కొవిడ్-19 లక్షణాల్లో జ్వరం,ముక్కు కారటం,తుమ్ములు గొంతు నొప్పి, దగ్గు వంటి తేలికపాటి లక్షణాలు ఉన్నాయి. ఇటీవల అతిసారం కరోనా లక్షణంగా కనిపిస్తోందని ఆయన పేర్కొనడం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఈ అంటువ్యాధి నివారణకు పోరాడాలని సూచించిన ఆయన ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరారు.
కరోనా రోగుల సంఖ్య పెరుగుతున్న వేగాన్ని దృష్టిలో ఉంచుకొని మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కరోనా సోకిన రోగుల్లో డయేరియా వంటి కడుపు సంబంధిత సమస్యలు కనిపించడం ఇదే తొలిసారి అని డాక్టర్ మోదీ తెలిపారు.
గత పదిరోజుల్లో అతిసారం వంటి వ్యాధులకు సంబంధించిన చాలామంది కరోనారోగులు తెరపైకి వచ్చారు. అయితే ఆసుపత్రిలో చేరే రేటు చాలా తక్కువగా ఉంది. ఇప్పటికే ఆరోగ్య సంబంధిత వ్యాధులు ఉన్నవారిని మాత్రమే ఆసుపత్రిలో చేర్చుకోవాల్సి ఉంటుంది.
గత కొన్నిరోజులుగా దేశంలో రెండువేల మందికి పైగా కరోనా రోగులు తెరపైకి వస్తున్నారు. బుధవారం కరోనా సోకిన రోగుల సంఖ్య 2927కు చేరగా… గురువారం వారి సంఖ్య 3 వేలు దాటింది. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇటీవల సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ… సంక్రమణను ప్రారంభంలోనే ఆపడం మన ప్రాధాన్యత అని టెస్ట్ ట్రాక్ ట్రీట్ వ్యూహాన్ని కొనసాగించాలని ప్రధాని సూచించారు.
కరోనా ఉన్నట్లు కాస్త అనుమానం వచ్చినా ప్రజలు వెంటనే కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి. పాజిటివ్ గా ఉన్నట్లు తేలితే.. హోం ఐసోలేషన్ లో ఉండాలని.. ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ఆస్పత్రికి ఉండి చికిత్స పొందాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కరోనా రెండు డోసుల టీకాలతో పాటు బూస్టర్ డోసు కూడా తీసుకుంటే కరోనా సోకినా పెద్ద ప్రమాదం ఉండదని చెబుతున్నారు.