తొలి దశే అనుకుంటే.. కరోనా రెండో దశ అంతకు మించిన స్పీడుతో అల్లకల్లోలం సృష్టిస్తోంది. వ్యాక్సినేషన్ లో భారత్ రికార్డు అని సంబరపడేలోపలే.. కేసుల నమోదులోనూ ఆల్ టైం రికార్డు అనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ మహమ్మారి కమ్మేస్తోంది. వరుస ఎన్నికల నేపథ్యంలో రెండో దశలో అత్యధిక మంది రాజకీయ నేతలు కరోనా బారిన పడ్డారు. తెలుగురాష్ట్రాలలోనూ కరోనా బారిన ప్రజాప్రతినిధులు చాలా మందే ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ […]
దేశం వెలిగిపోతోంది.. ఇది బీజేపీ స్లోగన్. కానీ ఇప్పుడు కరోనా సునామీలో భారత దేశం మునిగిపోతోంది. వైరస్ తో పోరులో గెలిచామంటూ ముందే సంబరాలు చేసుకున్న ప్రధాని మోడీ.. ఇప్పుడు మాత్రం జాగ్రత్తే మందు అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. వ్యాక్సినేషన్ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకుని.. భారమంతా రాష్ట్రాలపై వేశారు. నరేంద్ర మోడీ.. ఎప్పుడు ఏది మాట్లాడాలో.. ఎక్కడ ఏ స్విచ్ నొక్కాలో తెలిసిన వ్యక్తి! ఏడేళ్లుగా ప్రధాని పదవిలో ఉన్నా ఒక్కసారి కూడా ప్రెస్ […]
కరోనా అంటే ఈరోజు రేపట్లోనో పోయేది కాదు. భవిష్యత్తులో దీని వల్ల ఎన్నో ఇబ్బందులు, మరెన్నో సవాళ్లు తప్పవు. ఈ భయం ఇప్పుడేప్పుడే తొలగిపోయే అవకాశం లేదని స్పష్టంగా తెలుసు. మరి ప్రజల ఆరోగ్యం గురించి, వారి ప్రాణాలు గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన పాలకవర్గాలు మాత్రం కరోనా అంటే ఏదో చిన్న విషయం మాదిరి సన్నద్ధం అవుతున్నాయి. శాశ్వత ఊరట చర్యలు ఏ మాత్రం లేవు. అప్పటికప్పుడు ఆసుపత్రులను సిద్ధం చేసి, వైద్యం కోసం పరుగులు పెట్టడం […]
కోవిడ్ 19ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. డిసెంబరు 31 వరకు అన్ని అంతర్జాతీయ సర్వీస్లను నిలిపివేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అనుమతించిన తరువాతనే మన దేశంలో కోవిడ్ విజృంభణ ప్రారంభమైందని ఒక వాదన కూడా విన్పించేది. కారణం ఏదైనా విదేశాలకు రాకపోకలపై ఆంక్షలను వచ్చేనెల వరకు పొడిగించి కోవిడ్ కట్టడికి తన అప్రమత్తతను ప్రభుత్వం తేటతెల్లం చేసింది. అయితే ప్రభుత్వాలు చెబుతున్న మాటలు, పెడుతున్న ఆంక్షలను ఫాలో […]