iDreamPost
android-app
ios-app

తెలంగాణ హోమ్ మంత్రికి కరోనా

తెలంగాణ హోమ్ మంత్రికి కరోనా

తెలంగాణ హోమ్ మంత్రి మహమూద్ అలీకి కరోనా పాసిటివ్ నిర్ధారణ అయింది. కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతునారు. పరీక్షలు చేసుకోగా సోమవారం కరోనా నిర్ధారణ అయింది. కొద్ది రోజుల క్రితమే ఆయన ఎస్కార్ట్ వాహనం లోని ఒకరికి పాజీటీవ్ వచ్చింది. అయినప్పటికీ ఆ మర్నాడు జరిగిన హరిత హారం కార్యక్రమంలో హోమ్ మంత్రి పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. దీంతో ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న అధికారులు, ప్రజా ప్రతినిధులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అలాగే తెలంగాణలోని పోలీస్ అకాడమీలో ఏకంగా 180 మంది కరోనా బారిన పడ్డారు. వారందరినీ అకాడమీలో నే ఇసొలేషన్ లో ఉంచుతామని ఉన్నతాధికారులు తెలిపారు. ఆ అకాడమీలో శిక్షకులు, అధికారులు మొత్తం 2000 మంది పైనే ఉన్నారు. ఈ కేసులు చాలా ఆందోళనను కలిగిస్తున్నాయి. రాజ‌కీయ నేత‌ల్ని ఉలిక్కి ప‌డేలా చేస్తోంది. తెలుగు రాష్ట్రాల రాజ‌కీయ నాయ‌కుల‌ను కూడా ఈ క‌రోనా వదలడం లేదు. ఇప్పటికే మంత్రుల, ప‌లువురు ఎమ్మేల్యేల కుటుంబాల్లోనూ క‌రోనా క‌ల‌క‌లం సృష్టించింది. క‌ర్నూలు, గుంటూరు జిల్లాల‌కు చెందిన రాజ‌కీయ నేత‌ల కుటుంబాల్లోనూ వైర‌స్ అల‌జ‌డి రేపింది.

ఇక తెలంగాణ‌కు చెందిన రాజ‌కీయ నాయ‌కులు కూడా క‌రోనా ఫీవ‌ర్ తో ఒణుకుతున్నారు. మొట్ట మొదటిగా మాజీ ఎమ్మేల్యే, బీజేపీ సీనియ‌ర్ నేత చింత‌ల రామ‌చంద్రారెడ్డి కరోనా బారిన పడ్డారు. తెలంగాణ‌లోని అధికార పార్టీ నేత‌ల‌ను కూడా వైర‌స్ ప‌ట్టి పీడిస్తోంది. నిజామాబాద్ అర్బ‌న్ ఎమ్మెల్యే బిగాల గ‌ణేశ్ గుప్తా, జ‌న‌గామఎమ్మెల్యే ముతిరెడ్డి యాదగిరి రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కరోనా వైరస్ బారిన పడ్డారు. మంత్రి హరీష్ హోమ్ క్వారంటైన్ కే పరిమితం అయ్యారు. నిన్న బీజేపీ ఎమ్మెల్యే రాజా సిం గ్ గన్ మెన్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో రాజా సింగ్ కూడా పరీక్షలు చేయించు కోనున్నారు. ప్రస్తుతానికి హోమ్ క్వారన్ టైన్లో ఉన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు కూడా కరోనాతో హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.
ఈ మధ్య కాలంలోనే ఆ పార్టీ మరో నేత గూడూరు నారాయణ రెడ్డి కూడా మహమ్మారి బారిన పడ్డారు. ఏదేమైనా కరోనా… రాజకీయ వర్గాలను కూడా కుదిపేస్తోంది. క్షేత్ర స్థాయిలో కూడా విజృంభిస్తోంది. ఎక్కడ తమను కాటు వేస్తుంది అని ప్రముఖులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.