iDreamPost
android-app
ios-app

AUS vs WI: కరోనాతో బాధపడుతూనే గ్రౌండ్​లోకి దిగిన ఆసీస్ స్టార్.. ఏం గుండె బాస్!

  • Published Jan 25, 2024 | 2:16 PM Updated Updated Jan 25, 2024 | 2:16 PM

చిన్న ఆరోగ్య సమస్య ఉంటేనే కొందరు ప్లేయర్లు మ్యాచ్​లో ఆడేందుకు వెనుకాడతారు. అలాంటిది ఓ ఆటగాడు కరోనాతో బాధపడుతూ గ్రౌండ్​లోకి దిగాడు.

చిన్న ఆరోగ్య సమస్య ఉంటేనే కొందరు ప్లేయర్లు మ్యాచ్​లో ఆడేందుకు వెనుకాడతారు. అలాంటిది ఓ ఆటగాడు కరోనాతో బాధపడుతూ గ్రౌండ్​లోకి దిగాడు.

  • Published Jan 25, 2024 | 2:16 PMUpdated Jan 25, 2024 | 2:16 PM
AUS vs WI: కరోనాతో బాధపడుతూనే గ్రౌండ్​లోకి దిగిన ఆసీస్ స్టార్.. ఏం గుండె బాస్!

కొవిడ్-19.. ఈ పేరు వింటేనే అందరూ భయపడతారు. ఈ మహమ్మారి వల్ల కొన్నాళ్ల పాటు ప్రపంచం స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. లాక్​డౌన్​ల వల్ల ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. కొవిడ్ ఎఫెక్ట్ క్రికెట్ మీద కూడా పడింది. చాలా సిరీస్​లు వాయిదా పడ్డాయి. జనజీవనం మళ్లీ సాధారణ స్థితికి చేరుకునే వరకు క్రికెట్​ ఆగిపోయింది. అయితే అంతా నార్మల్ అయిపోవడంతో మ్యాచులు జరుగుతున్నాయి. కానీ ఎప్పటికప్పుడు కొత్తరూపు సంతరించుకుంటూ సబ్​వేరియంట్ రూపంలో వేగంగా విస్తరిస్తోంది కరోనా. ఇప్పటికీ కొన్ని దేశాలను ఈ వైరస్ ఇబ్బంది పెడుతోంది. నాలుగు గోడల మధ్య ఉంటూ గ్రౌండ్స్​కు మాత్రమే పరిమితమయ్యే క్రికెటర్లను కూడా ఈ మహమ్మారి వదలడం లేదు. ఆస్ట్రేలయా జట్టులో హెడ్ కోచ్ ఆండ్రూ మెక్​డొనాల్డ్​తో పాటు స్టార్ ఆల్​రౌండర్ కామెరాన్ గ్రీన్​ ఇప్పుడు కొవిడ్​తో బాధపడుతున్నారు. అయితే కరోనాతో బాధపడుతూనే గ్రౌండ్​లోకి దిగాడు గ్రీన్.

సాధారణంగా ఆటగాళ్లు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. హెల్త్ బాగోకపోతే గ్రౌండ్​లోకి దిగరు. కీలక మ్యాచ్ ఉంటే తప్ప అనారోగ్యంతో బాధపడుతూ ఆడరు. కానీ ఆసీస్ ప్లేయర్ గ్రీన్ మాత్రం కరోనాతో ఇబ్బంది పడుతూనే వెస్టిండీస్​తో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్​లో బరిలోకి దిగాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా జాతీయ గీతం పాడే సమయంలో గ్రీన్ మిగతా ప్లేయర్లు అందరికీ దూరంగా నిలబడ్డాడు. మ్యాచ్​ జరుగుతున్నప్పుడు కూడా విండీస్ బ్యాటర్లు ఔటైన సమయంలో ఇతర టీమ్​మేట్స్​తో కలసి అతడు సెలబ్రేట్ చేసుకోలేదు. ఒక్కడే బౌండరీ రోప్ దగ్గర దూరంగా ఉండిపోయాడు. అయితే ఇతరులను ముట్టుకోకున్నా అతడు 3 ఓవర్లు బౌలింగ్ చేయడం విశేషం. మూడు ఓవర్లు వేసి 3 పరుగులు మాత్రమే ఇచ్చిన గ్రీన్.. ఒక మెయిడిన్ వేశాడు.

He got down to the ground even though he was suffering from Corona!

కామెరాన్ గ్రీన్ కరోనాతో బాధపడుతూ గ్రౌండ్​లోకి దిగడం, బౌలింగ్ కూడా వేయడం మీద సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొవిడ్​తో బాధపడుతూ ఆడటం అవసరమా? అతడి వల్ల మిగతా ప్లేయర్లకూ వ్యాధి అంటుకుంటే పరిస్థితి ఏంటని కొందరు అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం టీమ్ కోసం వ్యాధి బాధిస్తున్నా గ్రౌండ్​లోకి దిగి ఆడటం సూపర్బ్ అని మెచ్చుకుంటున్నారు. ఏం గుండెరా అది.. అతడి డెడికేషన్​కు హ్యాట్సాఫ్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ఈ మ్యాచ్​లో టాస్ నెగ్గిన విండీస్ కెప్టెన్ బ్రాత్​వైట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఆ టీమ్​కు మంచి స్టార్ట్ దొరకలేదు. బ్రాత్​వైట్ (4) త్వరగా పెవిలియన్​కు చేరుకున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్ 5 వికెట్లకు 131 పరుగులతో ఉంది. హాడ్జ్ (32 నాటౌట్), జోషువా (35 నాటౌట్) క్రీజులో ఉన్నారు. మరి.. కరోనాతో బాధపడుతున్నా టీమ్ కోసం బరిలోకి దిగిన గ్రీన్ మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.