Idream media
Idream media
ఎలాంటి తారతమ్యాలు లేకుండా అజాగ్రత్తగా ఉన్న వారిని కరోనా వైరస్ చుట్టుముడుతోంది. కరోనా కట్టడిలో ఉన్న వైద్యులు, పోలీసులు, ఇతర సిబ్బందితోపాటు సామాన్యులు, ధనవంతులు, సాధారణ ప్రజలు, ప్రజా ప్రతినిధులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ బారినపడుతున్నారు. ఇప్పటికే ఏపీలో పలువురు తాజా, మాజీ ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు, కార్యాలయ, వ్యక్తిగత సిబ్బంది కరోనా వైరస్ బారిన పడగా.. తాజాగా అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది.
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అనారోగ్యం కారణంగా పరీక్ష చేయించుకోగా కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. అయితే ఆయనకు కరోనా లక్షణాలు చాలా స్పల్పంగానే ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో ఆయన చెన్నైలోని అపోలో చే రారు. సూళ్లూరుపేటకు చెన్సై దగ్గర కావడంతో ఆయన చికిత్స కోసం అక్కడకు వెళ్లినట్లు సమాచారం.
ఇప్పటికే వైసీపీ ఎస్.కోట, పొన్నూరు, కోడుమూరు ఎమ్మెల్యేలు వైరస్ బారిన పడి కోలుకుంటున్నారు. నిన్న డిప్యూటీ సీఎం అంజాద్ బాష వైరస్‌తో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేరారు. తాజాగా వైరస్ సోకిన ప్రజా ప్రతినిధుల ఆ జాబితాలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే చేరారు. మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాల రావు కూడా తనకు వైరస్ సోకినట్లు ఇటీవల స్వయంగా వెల్లడించారు.