దీపావళి, వివాహ ముహూర్తాలు, ఇతర పండుగల నేపథ్యంలో కోవిడ్ పట్ల ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిపోయింది. ఈ మాట అంటున్నది ఎవరో కాదండోయ్.. సంబంధిత అంశంలో గత కొన్నినెలలుగా పరిశీలిస్తున్న నిపుణులంటున్న మాటలు. దీపావళి పేరుజెప్పి దేశ వ్యాప్తంగా ప్రజలు స్వేచ్ఛగానే బైటకు వచ్చారు. షాపింగ్ తదితర కార్యకలాపాల్లో విస్తృతంగా పాలుపంచుకుంటున్నారు. అన్లాక్ తరువాత ఈ విధమైన స్వేచ్ఛను స్వాగతించదగినదే అయినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఇలా వ్యవహరించడం పట్ల నిపుణులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. డబ్లు్యహెచ్వో […]