ఏపీలో కోవిడ్ 19 యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్లు ప్రభుత్వం విడుదల చేస్తున్న బులిటెన్‌ను బట్టి తెలుస్తోంది. ఒక దశలో లక్షకు చేరువగా యాక్టివ్ కేసులు చేరుకున్నాయి. అయితే ఇప్పుడవి 59వేలకు అటూ ఇటూగా కొనసాగుతున్నాయి. అంటే దాదాపు సగం వరకు యాక్టివ్ కేసులు తగ్గినట్టేనని భావించొచ్చు. మరో వైపు విస్తృతంగా చేపడుతున్న వైద్య పరీక్షల్లో బైటపడుతన్న పాజిటివ్‌ల సంఖ్య కూడా గత అయిదార్రోజులుగా తగ్గుతోంది. మరో వైపు కోలుకుని ఇళ్ళకు వెళుతున్న వారి సంఖ్య […]