నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ కు చేరుకుంది. నువ్వానేనా అంటూ పార్టీలన్నీ పోటీ పడుతున్నాయి. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్, బీజేపీ అభ్యర్థి రవి కుమార్ తదితరులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే జానా సొంతూరు అనుములలో మంగళవారం జరిగిన గొడవ వివాదానికి దారి తీసింది. టీఆర్ఎస్ ప్రచారాన్ని అడ్డుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓటమి భయంతోనే తమ ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని టీఆర్ఎస్ లీడర్లు ఆరోపిస్తున్నారు. […]