ఒకప్పుడు రాజేంద్రప్రసాద్, నరేష్ లాంటి హీరోలు కేవలం హాస్యభరిత చిత్రాల ద్వారానే గుర్తింపు తెచ్చుకుని స్టార్లు అయ్యారు. కమర్షియల్ సినిమాలకు ధీటుగా వీళ్ళ చిత్రాలు వసూళ్లు సాదించేవి. స్వర్గీయ డి రామానాయుడు గారు తీసిన అహ నా పెళ్ళంట ముప్పై ఏళ్ళ క్రితం సిల్వర్ జూబ్లీ ఆడడానికి కారణం కామెడీ కంటెంటే తప్ప మరొకటి కాదు. పెద్ద హీరోతో పోటీ పడి మరీ చిత్రం భళారే విచిత్రం, జంబలకిడిపంబలు సూపర్ హిట్ కావడం ఎవరూ మర్చిపోలేరు. వంశీ […]