దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) అమలులోకి రానుంది. రేపటి నుంచి మూడు నెలల పాటు రాజధాని ఢిల్లీలో ఎన్ఎస్ఏ అమలులో ఉంటుంది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్సీఆర్)లకు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా ఆందోళనలు తీవ్రస్థాయిలో జరుగుతున్న సమయంలో ఈ చట్టం అమలులోకి రావడం చర్చనీయాంశమైంది. ఏవరైనా వ్యక్తి, వ్యక్తులు లేదా వారి చర్యల వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిళ్లుతుందని పోలీసులు భావిస్తే వారిని వెంటనే నిర్బంధంలోకి తీసుకునే […]