ఒకటే పార్టీ.. కానీ రెండేళ్లు తిరిగే లోగా మూడు స్వరాలు వినిపిస్తోంది. ఒకే నాయకుడి పట్ల విభిన్న గొంతులతో స్పందిస్తున్న తెలుగుదేశం పార్టీ తీరు విస్మయరంగా కనిపిస్తోంది. కానీ ఆ పార్టీ నేతలు బెరుకు లేకుండా వ్యవహరిస్తున్నారు. మోడీ అంతటి మొనగాడు లేడని చెప్పిన వాళ్ళే, ఆయనే పెద్ద మోసగాడు అంటూ నినదించారు. ఇప్పుడు మళ్లీ మహానుభావుడిగా కీర్తించడం మొదలు పెట్టారు. 2018 ఫిబ్రవరి వరకూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్ల టిడిపి నేతలు సానుకూలంగా వ్యవహరించారు. […]