తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలపై టీడీపీ,బీజేపీ నేతల విషప్రచారాలకు, వాస్తవానికి పొంతన లేదని కేంద్రమంత్రి పరోక్షంగా తేల్చేశారు. తాజాగా బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి చేసిన వ్యాఖ్యలు దానికి నిదర్శనం. మోడీ మంత్రివర్గ సహచరుడే నేరుగా టీటీడీ పాలకమండలి ప్రయత్నాలను అభినందించిన తీరు ఆసక్తికరం. కొద్దిరోజుల క్రితం బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. తిరుమల వేదికగా మతరాజకీయాలు విపక్షాల సృష్టి అని ఆయన మండిపడ్డారు. […]