తెలంగాణలో కరోనా కేసులు 15000కు చేరువలో ఉన్నాయి. ఈ నేపధ్యంలో కొవిడ్-19 నియంత్రణ చర్యలు, బాధితులకు చికిత్స, ఆస్పత్రుల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయో పర్యవేక్షించెందుకు కేంద్ర బృందం ఆదివారం సాయంత్రం హైదరాబాద్ చేరుకుంది. ఈ సందర్భంగా బృందం సభ్యులు సోమవారం వివిధ ఆస్పత్రుల్లో ల్యాబులను పరిశీలిస్తారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఏదైనా కంటైన్మెంట్ క్లస్టర్లో పర్యటిస్తారు. అక్కడి నుంచి నేరుగా బీఆర్కే భవన్లో రాష్ట్ర సీఎస్, ఆరోగ్యశాఖ అధికారులతో భేటీ అవుతారు. […]
ఒక్కరోజులో 14,821 పాజిటివ్ కేసులు-445 మరణాలు కరోనా వైరస్ ప్రస్తుతం దేశాన్ని వణికిస్తోంది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైరస్ ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకి 14 వేలకు పైగా కేసులు, 350 పైగా మరణాలు సంభవించడం నిత్యంగా మారింది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 14,821 పాజిటివ్ కేసుల నిర్దారణ అయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4,25,282 కి చేరింది. అంతేకాకుండా మరణాల […]