చేపల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దాంతో లారీలో ఉన్న చేపలన్నీ రోడ్డుపై పడ్డాయి. ఇది చూసిన చుట్టుపక్కల ప్రజలు అరగంటలో చేపలన్నింటినీ ఎత్తుకుపోయారు. ఈ ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ఏపీ నుంచి మహారాష్ట్రలోని నాగపూర్ వైపు చేపల లోడుతో వెళ్తున్న లారీ.. జిల్లాలోని బూర్గంపాడు మండలం ఐటీసీ క్రాస్ రోడ్డు వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలవ్వగా.. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. […]