కరోనా వచ్చి రెండేళ్లయింది. కానీ ఇంకా దానిపట్ల ఉన్న భయం పోలేదు. దేశం, విదేశాల్లో కరోనా మరణాలు, కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్ల ద్వారా కరోనాను అంతమొందించవచ్చని అనుకున్నారు కానీ.. సాధ్యపడలేదు. వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాత కూడా కొందరికి కరోనా సోకిన విషయం తెలిసిందే. అందుకే బూస్టర్ డోస్ ను వేయాలని ప్రతిపాదించింది కేంద్రం. తొలుత 40 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసును అందించింది. ఆ తర్వాత ప్రైవేటు ఆస్పత్రుల్లో కొంత నగదు చెల్లించి బూస్టర్ […]
కరోనా మహమ్మారి పేరు చెబితేనే ప్రజలు వణికిపోయేలా చేస్తోంది. ఎన్నో రోజులు సంవత్సరాలు గడుస్తున్నా అది మాత్రం అంతం అవ్వడం లేదు. కొత్త కొత్త వేరియంట్లతో రూపు మార్చుకుంటూ.. ప్రజల ప్రాణాలను మింగేస్తోంది. అయితే ఈ మహమ్మారి నుంచి ప్రాణాలను రక్షించుకోవాలంటే.. టీకాయే శ్రీరామరక్ష అని అందరూ చెప్పారు. మొదటి డోసు, రెండో డోసు తాజాగా బూస్టర్ డోసు కూడా తీసుకోవాలంటూ… సూచిస్తున్నారు. కరోనా టీకాలతో పాటు మాస్కు ,భౌతికదూరం తప్పనిసరి అని చెబుతున్నారు. కానీ.. ప్రస్తుతం […]
కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఉత్పత్తి సంస్థలు వ్యవహరిస్తున్న తీరుతో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నెల 10వ తేదీ నుంచి వ్యాక్సిన్ బూస్టర్ డోసును ప్రైవేటుగా అందుబాటులో ఉంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు పైబడిన వారు ప్రైవేటు కేంద్రాలలో వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకోవాలని సూచించింది. రెండో డోసు తీసుకుని 9 నెలలు పూర్తయిన వారు బూస్టర్ డోసు తీసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు […]
మహమ్మారి కరోనా వైరస్‌ను ఎదుర్కొనే క్రమంలో వరుస విరామంలో వ్యాక్సిన్ డోసులను తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని నిపుణులు ఇప్పటికే తేల్చారు. ప్రారంభంలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటే సరిపోతుందని అంచనా వేయగా.. ఆ తర్వాత బూస్టర్ డోసు కూడా తీసుకుంటే మంచిదంటూ నిపుణులు సూచించారు. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు తగిన జాగ్రత్తలు పాటిస్తూ వ్యాక్సిన్ తీసుకుకోవడమే ప్రజల ముందున్న లక్ష్యం. వ్యాక్సిన్ తీసుకున్న వారికి వైరస్ సోకినా ప్రాణాపాయం తప్పుతోంది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత దాని ప్రభావం […]
ప్రపంచంలోని వివిధ దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతోంది. కొత్త మ్యూటేషన్లు వస్తుండడంతో వైరస్ వ్యాప్తి నిత్యకృత్యమైపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో దేశంలో కరోనా నాలుగోవేవ్ వస్తుందనే ఆందోళన మొదలైంది. కేంద్రం కూడా నాలుగో వేవ్ వచ్చే ప్రమాదం ఉందంటూ.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. నిపుణులు కూడా నాలుగో వేవ్ వచ్చే అవకాశం ఉందంటూ అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో నాలుగో వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు కేంద్రప్రభుత్వం సమాలోచనలు […]