iDreamPost
android-app
ios-app

ఆ వ్యాక్సిన్ తీసుకున్న వారు బూస్టర్ డోస్ తప్పక తీసుకోవాలట..!

  • Published Apr 26, 2022 | 6:06 PM Updated Updated Apr 26, 2022 | 8:49 PM
  • Published Apr 26, 2022 | 6:06 PMUpdated Apr 26, 2022 | 8:49 PM
ఆ వ్యాక్సిన్ తీసుకున్న వారు బూస్టర్ డోస్ తప్పక తీసుకోవాలట..!

కరోనా మహమ్మారి పేరు చెబితేనే ప్రజలు వణికిపోయేలా చేస్తోంది. ఎన్నో రోజులు సంవత్సరాలు గడుస్తున్నా అది మాత్రం అంతం అవ్వడం లేదు. కొత్త కొత్త వేరియంట్లతో రూపు మార్చుకుంటూ.. ప్రజల ప్రాణాలను మింగేస్తోంది. అయితే ఈ మహమ్మారి నుంచి ప్రాణాలను రక్షించుకోవాలంటే.. టీకాయే శ్రీరామరక్ష అని అందరూ చెప్పారు. మొదటి డోసు, రెండో డోసు తాజాగా బూస్టర్ డోసు కూడా తీసుకోవాలంటూ… సూచిస్తున్నారు.

కరోనా టీకాలతో పాటు మాస్కు ,భౌతికదూరం తప్పనిసరి అని చెబుతున్నారు. కానీ.. ప్రస్తుతం పరిస్థితి వేరేలా ఉంది. తాజాగా పుట్టుకొచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై కోవిషీల్డ్ టీకా ప్రభావవంతంగా పనిచేయడం లేదని… పుణేలోని భారత వైద్య పరిశోధన మండలి తెలిపింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ తాజా అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడి అయినట్లు స్పష్టం చేసింది.

ఢిల్లీకి చెందిన ఓ 38 ఏళ్ల ఆరోగ్య కార్యకర్త టీకా తీసుకోవడానికి ముందు ఒకసారి కోవిషీల్డ్ తీసుకున్నారు. తర్వాత రెండుసార్లు ఆయన కరోనా బారినపడ్డారు. గతంలో కరోనా సోకి కోవిషీల్డ్ రెండు డోసుల టీకా తీసుకున్న వారి రోగ నిరోధక వ్యవస్థను ఒమిక్రాన్ సమర్థంగా ఎదుర్కోగలుగు తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇలాంటి వారు కోవిడ్ రెండు డోసుల టీకాలతో పాటు బూస్టర్ డోస్ కూడా కచ్చితంగా తీసుకోవాల్సిందేనని వివరించారు.

పరిశోధకుల కథనం ప్రకారం.. ఆ ఆరోగ్య కార్యకర్తకు తొలిసారిగా 2020 అక్టోబర్ 9న కోవిడ్ పాజిటివ్ వచ్చిందట. ఏడాది తర్వాత అంటే 2021 నవంబర్ లో అతడిలో మళ్లీ కరోనా లక్షణాలు కనిపించాయి. అయితే పరీక్ష చేయించుకుంటే డెల్టా వేరియంట్ సోకిందని వెల్లడైంది. రెండు నెలల్లోనే మరోసారి కూడా కరోనా సోకింది. తాజాగా ఈ సంవత్సరం అంటే 2022 జనవరి 24న ఒమిక్రాన్ వేరియంట్ సోకింది.

ఆ ఆరోగ్య కార్యకర్త కోవిషీల్డ్ టీకా మొదటి డోసును 2021 జనవరి 31న రెండో డోసును మార్చి 3న తీసుకున్నారు. టీకా బూస్టర్ డోసులు ఒమిక్రాన్ వేరియంట్ పై మెరుగైన రోగ నిరోధక స్పందనను కలిగిస్తున్నందున కోవిషీల్డ్ తీసుకున్న వారు కచ్చితంగా వేయించుకోవాలని చెబుతున్నారు. అప్పడే కరోనా నుంచి పూర్తి స్థాయిలో రక్షణ లభిస్తుందని పేర్కొంటున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet