ఆమెకు చూడటానికి చిన్నప్పట్నుంచీ కళ్ళు లేవు. అయినా దిగులు పడకుండా కష్టపడి చదివి ప్రభుత్వ టీచర్ గా ఉద్యోగం సాధించింది. అక్కడితో ఆగకుండా సివిల్స్ ని ప్రయత్నించి సివిల్స్ లో ర్యాంక్ సాధించింది. ఢిల్లీ దగ్గర్లోని రాణిఖేడా అనే గ్రామంలో ఓ సాధారణ కుటుంబంలో పుట్టింది ఆయుషి. పుట్టుకతోనే అంధురాలు అయినా తల్లితండ్రుల సహాయంతో తన గ్రామంలోనే ఓ ప్రైవేటు స్కూల్లో చదువుకుంది. ఆ తరువాత శ్యాంప్రసాద్ ముఖర్జీ కాలేజీలో బి.ఏ, ఇగ్నో యూనివర్శిటీలో ఎంఏ (హిస్టరీ), […]