ఏపీలో విగ్రహాలపై దాడులు రోజురోజుకు రాజీకీయంగా కాక పుట్టిస్తున్నాయి. అటు బీజేపీ-జనసేన,ఇటు టీడీపీ ఆలయాలపై దాడులను క్యాష్ చేసుకునేందుకు నానా హంగామాచేస్తున్నాయి. ముఖ్యంగా రామతీర్థం ఘటనతో పరిస్థితి పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. ఏపీలో కొంతకాలంగా ఆలయాలపై దాడులు జరుగుతున్న ఘటనలపై టీడీపీ నేతలు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 144 ఘటనలు జరిగాయని తెలిపారు. గవర్నర్ తో భేటీ అనంతరం వర్ల రామయ్య, ధూళిపాళ్ల నరేంద్ర […]