దొంగలందు మంచి దొంగ వేరయా.. చెడ్డవారియందు మంచి చెడ్డవారు వేరయా.. అంటూ కొత్త భాష్యం చెబుతున్నారు కమలనాథులు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఢిల్లీలో తమ మాట చెల్లక.. కేంద్రం మరింత స్పష్టంగా ప్రైవేటీకరణపై కుండబద్దలు కొట్టాక కొద్దిరోజులుగా మొహం చెల్లని బీజేపీ నేతలు.. ఇప్పడు ప్రైవేటీకరణలోనూ మంచిని చూపిస్తామంటున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్సీ, విశాఖకే చెందిన పీవీఎన్ మాధవ్ తాజాగా చేసిన ప్రకటన ఆ పార్టీ రాష్ర్ట నేతల్లో నెలకొన్న అయోమయానికి, కేంద్రాన్ని ఒప్పించలేక.. ఏదోలా […]