2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడం అందరికీ విడ్డూరంగా అనిపించింది. కలిసి కార్యక్రమాలు చేస్తామని అప్పట్లో టీడీపీ, జనసేన నేతలు ప్రకటించారు. అయితే పొత్తు పెట్టుకుని రెండున్నరేళ్లు అయినా.. ఆ రెండు పార్టీలు పొత్తులో ఉన్నట్లు ఎక్కడా అనిపించలేదు, కనిపించలేదు. ముఖ్యంగా జనసేన పార్టీ బీజేపీతో పొత్తులో లేమన్నట్లుగానే వ్యవహరించింది. బీజేపీ మాత్రం జనసేనతో కలసి 2024లో అధికారంలోకి వస్తామని […]
పవన్ కళ్యాణ్తో పొత్తు విషయంలో వామపక్ష నేత నారాయణ తప్పుచేసాం.. లెంపలేసుకుంటున్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన రాజకీయాల్లో వేడి రగిల్చారనే చెప్పాలి. ఏ విషయం మీదనైనా ముక్కుసూటిగా మాట్లాడే నారాయణ తన ఉద్దేశాన్ని నేరుగానే ప్రకటించేసారు. ఈ విషయంలో జనసేన–పవన్ కళ్యాణ్లు మౌనమే తమ సమాధానంగా ఊరకుండిపోయారు. దీంతో ఎవరికి తోచిన విధంగా వారు కేప్షన్స్ పెట్టుకుని, కథలల్లేసుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ తీరును గమనించిన వారెవరికైనా అభ్యంతరాలు అనేకం పుట్టుకొస్తాయంటున్నారు విశ్లేషకులు. తగినంత […]
ఆంధ్రప్రదేశ్లో కమలం బలపడాలనే ఆలోచనలు చేస్తోంది. కుదిరితే 2024లో అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అది అంత సులువు కాదని ఆ పార్టీ నేతలకు తెలుసు. పరుగుపందెంలో గెలిచేది ఒక్కడైనా పోటీలో ఉండే ప్రతి ఒక్కరూ తాము గెలుస్తామనే నమ్మకంతోనే పరిగెడతారు. తమ శక్తి, సామర్థ్యాలు ఎంత..? అని తెలిసి కూడా గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తారు. అదే తీరున రాష్ట్రంలో కమలం నేతలు కూడా తాము అధికారంలోకి వస్తామనే ప్రకటనలు చేస్తున్నారు. ఏపీలో వైసీపీకి […]