పూర్తి స్థాయి దేశీయ ఉత్పత్తిగా పేరు పొందిన కోవిడ్ టీకా కోవాగ్జిన్ పేటెంట్ హక్కులు పూర్తిగా భారత్ బయోటెక్ సంస్థవేనా?.. ఇందులో కేంద్ర ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యం లేదా??.. ఆ సంస్థ సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ (జేఎండీ) సుచిత్ర ఎల్లా వ్యాఖ్యలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే చెబుతున్నాయి. అంతేకాదు కోవాగ్జిన్ టీకా రూపకల్పనకు సంబంధించిన సాంకేతిక సమాచారాన్ని (ఫార్ములా) ఇతర సంస్ధలతో పంచుకోవడానికి తాము సిద్ధంగా లేమని ఆమె కుండబడ్డలుగొట్టారు. ఇన్నాళ్లూ కోవాగ్జిన్ తయారీలో ఐసీఎంఆర్, […]