బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి చెందిన రెండు అపార్ట్మెంట్లలో సోదాలు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అవినీతి సొమ్ము ఖజానానే కనిపెట్టింది. రెండు రోజుల్లో రూ.50 కోట్ల డబ్బు దొరికింది. మొదటి అపార్ట్మెంట్లో రూ.21.90 కోట్లు, నిన్న రాత్రి ఆమె మరో ఇంట్లో రూ.27.90 కోట్ల నగదు దొరికింది. అన్నీ నోట్ల కట్టలు. 50 కోట్లు అంటే మాటలు కాదు. వాటిని దాయడానికి చాలా స్పేస్ కావాలి. ED ఒక అల్మారా తెరిచింది. […]