ఏపీ రాజధాని వికేంద్రీకరణ ప్రక్రియకు ముహూర్తం సిద్ధం అవుతోంది. అందుకు తగ్గట్టుగా అడుగులు పడుతున్నాయి. అమరావతితో పాటుగా మూడు రాజధానుల ప్రతిపాదన కార్యరూపం దాల్చడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే సీఎం ప్రతిపాదన, జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ తో పాటుగా బీసీజీ రిపోర్ట్ దానిని బలపరచడంతో ఇక ప్రభుత్వానికి అడ్డంకి తొలగినట్టేనని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా నియమించిన హైపవర్ కమిటీ తొలి సమావేశం సీఆర్డేయే కార్యాలయం వేదికగా నిర్వహించబోతున్నారు. ఈనెల 18లోగా హైపవర్ కమిటీ […]
రాజధాని వికేంద్రీకరణకు అవకాశాలు కనిపిస్తున్నాయి. జీఎన్ రావు కమిటీతో పాటు బోస్టన్ కమిటీ కూడా రాజధాని వికేంద్రీకరణకు మొగ్గుచూపింది. నిన్న అమరావతిలో సీఎం జగన్కు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కమిటీ సమర్పించింది. ఆ నివేదికలో ఏపీ అభివృద్ధి, రాజధానిపై ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేశారు. మూడు రాజధానుల ఏర్పాటుతోనే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. దేశంలో బహుళ రాజధానులున్న రాష్ట్రాలపైన, ప్రపంచవ్యాప్తంగా గత 50 సంవత్సరాలలో జరిగిన నూతన రాజధాని నగర నిర్మాణాల ప్రగతి మీద అధ్యయనం […]