1995లో వరస డిజాస్టర్ల తర్వాత అంతర్మథనం చెందిన చిరంజీవి ఆ కారణంగానే 1996లో ఏ రిలీజు లేకుండా అభిమానులను నిరాశపరిచినా తన సబ్జెక్టు సెలక్షన్ ని సింహావలోకనం చేసుకోవడనికి టైం తీసుకున్నారు. దాని ఫలితమే హిట్లర్, మాస్టర్ రూపంలో రెండు బ్లాక్ బస్టర్లు దక్కాయి. స్వంత బ్యానర్ అంజనా ప్రొడక్షన్లో అప్పటిదాకా మూడు సినిమాలు వచ్చాయి. రుద్రవీణ పేరు తెచ్చింది కానీ ఫ్లాప్ అయ్యింది. త్రినేత్రుడు కమర్షియల్ గా ఓకే కానీ ఆశించిన రేంజ్ కు వెళ్ళలేదు. […]