iDreamPost
android-app
ios-app

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఇప్పుడు ఎంపీగా పార్లమెంట్‌లోకి.. ఎవరో గుర్తుపట్టారా

ఈ ఎన్నికల్లో సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు పోటీ చేసిన సంగతి విదితమే. వీరిలో కొంత మంది గెలువగా.. మరికొంత మంది ఓడిపోయారు. ఇదిలా ఉంటే.. ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఇప్పుడు గెలిచి...

ఈ ఎన్నికల్లో సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు పోటీ చేసిన సంగతి విదితమే. వీరిలో కొంత మంది గెలువగా.. మరికొంత మంది ఓడిపోయారు. ఇదిలా ఉంటే.. ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఇప్పుడు గెలిచి...

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఇప్పుడు ఎంపీగా పార్లమెంట్‌లోకి.. ఎవరో గుర్తుపట్టారా

ఈ లోక్ సభ ఎన్నికల్లో సినీ రంగానికి చెందిన పలువురు తారలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వెండితెర, బుల్లితెరపై మెరిసిన సినీ సెలబ్రిటీలు.. వివిధ పార్టీల నుండి పోటీ చేశారు. కంగనా రనౌత్, అరుణ్ గోవిల్, డ్రీమ్ గర్ల్ హేమమాలిని, మనోజ్ తివారీ, మలయాళ నటుడు సురేష్ గోపీ, రేసు గుర్రం విలన్ బీజెపీ తరుఫున పోటీ చేసి గెలుపొందారు. అలాగే నవనీత్ కౌర్, స్మృతి ఇరానీ, రాధిక వంటి నటీమణులు ఓడిపోయారు. కాగా, ఈ ఫలితాల్లో బీజెపీకి కాంగ్రెస్ గట్టిపోటీనిచ్చిన సంగతి విదితమే. అలాగే బెంగాల్లో సైతం కమల దళానికి చుక్కలు చూపించింది అధికార టీఎంసీ. అక్కడ 42 స్థానాలకు గాను.. 29 స్థానాలకు కైవలం చేసుకుంది తృణమూల్. బీజెపీకి కేవలం 12 సీట్లు మిగిలాయి. కాంగ్రెస్‌కు ఒక్కటంటే ఒక్క స్థానం దక్కింది.

పశ్చిమ బెంగాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నటీనటులు పోటీ చేశారు. టీఎంసీ నుండి స్టార్ నటీమణులు బరిలోకి దిగారు. వారిలో విజయం సాధించింది ప్రముఖ నటి. ఇదిగో ఈ ఫోటోలో ఉన్నయాక్టర్స్.. త్వరలో లోక్ సభలోకి అడుగుపెట్టనుంది. టాలీవుడ్ ఇండస్ట్రీని ఐదేళ్ల పాటు అలరించిన ఆ బ్యూటీ.. ఇప్పుడు ప్రజల తరుఫున పార్లమెంట్‌లో తన గళాన్ని వినిపించనుంది. ఆమె ఎవరో కాదు.. రచనా బెనర్జీ. బెంగాల్ కు చెందిన రచనా.. మిస్ బెంగాల్, మిస్ కోల్ కత్తా అవార్డులను గెలిచింది. మిస్ ఇండియా పోటీల్లో కూడా సత్తా చాటింది. ఆ తర్వాత ఆమె బెంగాల్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోయిన్ అయ్యింది. ఒడియా, తెలుగు, తమిళ్,కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది.

జేడీ చక్రవర్తి హీరోగా వచ్చిన నేను ప్రేమిస్తున్నా చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన రచనా, కన్యాదానం, రాయుడు, మావిడాకులు, అభిషేకం, బావగారు బాగున్నారా వంటి చిత్రాల్లో నటించింది. పిల్ల నచ్చింది, సుల్తాన్, పెద్ద మనుషులు, అంతా మన మంచికే, నీతో వస్తాను, లాహిరి లాహిరీ లాహిరీ వంటి చిత్రాల్లో నటించింది. 2002 తర్వాత ఆమె తెలుగు సినిమాల్లో కనిపించలేదు. సిద్దాంత్ మల్హోపాత్రాను వివాహం చేసుకన్న ఈ బ్యూటీ.. అతడికి విడాకులు ఇ చ్చింది. ఆ తర్వాత ప్రబోల్ బసును వివాహం చేసుకుని.. అతనితోనూ విడిపోయింది. ఇప్పుడు సింగిల్ లైఫ్ లీడ్ చేస్తుంది. ప్రస్తుతం ఓ టెలివిజన్ షోలో జడ్జిగా వ్యహరిస్తుంది. ఆ సమయంలో సీఎం మమతా బెనర్జీ ఆ ప్రోగ్రాంకు విచ్చేశారు. ఆ తర్వాత ఆమెతో పరిచయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టేలా చేసింది. రచనకు హుగ్లీ సీటును ఇచ్చింది టీఎంసీ. ఆమెకు రాజకీయాలు కొత్తైనా, బీజెపీ ఎత్తుగడలను తిప్పి కొట్టి విజయం సాధించింది. త్వరలో పార్లమెంట్ లోకి అడుగుపెట్టబోతుంది ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి