రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత సుజనా చౌదరికి ఢిల్లీ ఎయిర్పోర్టులో చెదు అనుభవం ఎదురైంది. అమెరికా వెళ్లేందుకు సిద్ధమైన సుజనా చౌదరిని ఎయిర్పోర్టు అధికారులు అడ్డుకున్నారు. బ్యాంకులను మోసం చేసిన కేసులో ఆయనపై లుక్ అవుట్ నోటీసులు ఉన్న నేపథ్యంలో అమెరికా వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్పోర్టు ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమతించలేదు. సుజనాను ఎయిర్ పోర్టు నుంచి వెనక్కి పంపేశారు. దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు చేయవద్దని సుజనాకు సూచించారు. […]