iDreamPost
android-app
ios-app

RBI నివేదిక: ఈ బ్యాంకుల్లోనే ఎక్కువ మోసాలు.. కస్టమర్ల వేల కోట్ల సొమ్ము మాయం!

  • Published May 30, 2024 | 7:46 PM Updated Updated May 30, 2024 | 7:46 PM

Huge Scams In These Banks: బ్యాంకు ఫ్రాడ్స్ జరగడం అనేది మనం తరచుగా వింటున్నాం. అయితే ఏ బ్యాంకుల్లో ఎక్కువగా ఫ్రాడ్స్ జరుగుతున్నాయో తెలుసా? ఏ బ్యాంకు ఖాతాదారులు ఎన్ని వేల కోట్ల సొమ్ము పోగొట్టుకున్నారో తెలుసా?

Huge Scams In These Banks: బ్యాంకు ఫ్రాడ్స్ జరగడం అనేది మనం తరచుగా వింటున్నాం. అయితే ఏ బ్యాంకుల్లో ఎక్కువగా ఫ్రాడ్స్ జరుగుతున్నాయో తెలుసా? ఏ బ్యాంకు ఖాతాదారులు ఎన్ని వేల కోట్ల సొమ్ము పోగొట్టుకున్నారో తెలుసా?

  • Published May 30, 2024 | 7:46 PMUpdated May 30, 2024 | 7:46 PM
RBI నివేదిక: ఈ బ్యాంకుల్లోనే ఎక్కువ మోసాలు.. కస్టమర్ల వేల కోట్ల సొమ్ము మాయం!

టెక్నాలజీ పెరిగాక డబ్బులు దొంగతనం చేయడం సులువైపోయింది కేటుగాళ్ళకి. ఏదో ఒక టెక్నిక్ వాడుకుని మాయ చేసి మోసాలకు పాల్పడుతూ కోట్లు కొల్లగొడుతున్నారు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఇలా ఖాతాదారుల నుంచి వీటి సమాచారం తెలుసుకుని మోసం చేస్తున్నారు. అయితే బ్యాంకులను బట్టి కూడా మోసాల సంఖ్య, పోగొట్టుకున్న సొమ్ము అనేది ఆధారపడి ఉంటుందని తాజాగా ఆర్బీఐ వెల్లడించింది. మన దేశంలో ఎక్కువగా ఈ బ్యాంకుల్లోనే మోసాలు జరుగుతున్నాయని ఆర్బీఐ తాజా నివేదిక వెల్లడించింది. గత మూడేళ్ళలో ప్రైవేట్ రంగ బ్యాంకుల్లోనే ఎక్కువ మోసాలు జరిగినట్లు ఆర్బీఐ వెల్లడించింది. అయితే ఎక్కువ మొత్తం సొమ్ము పోగొట్టుకున్న బ్యాంకుల్లో ప్రభుత్వ బ్యాంకులే ముందు ఉన్నాయని ఆర్బీఐ నివేదించింది.

వీటిలో ఇంటర్నెట్, కార్డ్ పేమెంట్స్ వంటి డిజిటల్ పేమెంట్స్ మోసాలు ఎక్కువ సంఖ్యలో నమోదయ్యాయని తెలిపింది. లోన్ పోర్ట్ఫోలియోలో ఎక్కువ మొత్తంలో డబ్బు మోసగాళ్ల బారిన పడినట్లు ఆర్బీఐ తన నివేదికలో వెల్లడించింది. లోన్ పోర్ట్ఫోలియో విషయంలో కూడా ప్రభుత్వ బ్యాంకుల వాటానే ఎక్కువగా ఉందని ఆర్బీఐ తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 9046 మోసాలు జరగ్గా.. 2022-23 ఆర్థిక ఏడాదిలో 13,564 మోసాలు జరిగినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరంలో 36,075 మోసాలు జరిగాయని ఆర్బీఐ పేర్కొంది. ప్రతి ఏటా మోసాల సంఖ్య పెరిగిపోతుందని.. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు పోగొట్టుకున్న సొమ్ము తక్కువే అని ఆర్బీఐ తెలిపింది.

అంతకు ముందు ఏడాదితో పోలిస్తే గత ఏడాది 26,127 కోట్ల నుంచి 13,930 కోట్లకు పోగొట్టుకున్న సొమ్ము తగ్గిందని వెల్లడించింది. 2021-22 ఆర్థిక ఏడాదిలో 3596 కార్డు మోసాలు, ఇంటర్నెట్ మోసాలు జరగ్గా.. 2023-24 ఏడాదికి వచ్చేసరికి 29,082 కార్డు, ఇంటర్నెట్ మోసాలు జరిగినట్లు ఆర్బీఐ పేర్కొంది. ఇందులో ఎక్కువగా కొద్దిపాటి నగదు మొత్తాలు ఉన్నట్లు ఆర్బీఐ పేర్కొంది. గత రెండేళ్లలో ఇలాంటి మోసాలతో కోల్పోయిన సొమ్ము రూ. 155 కోట్ల నుంచి రూ. 1457 కోట్లకు పెరిగిందని ఆర్బీఐ తన నివేదికలో పేర్కొంది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో నమోదైన మోసాలకు సంబంధించి ఆర్బీఐ మరో ఆసక్తికర అంశాన్ని బయటపెట్టింది. మోసం జరిగిన తేదీకి, మోసం జరిగినట్టు గుర్తించేందుకు మధ్య గ్యాప్ చాలా ఉంటుందని ఆర్బీఐ గుర్తించింది. అంటే ఖాతాదారుడికి మోసపోయిన విషయం ఆరోజు కాకుండా చాలా ఆలస్యంగా వెలుగులోకి వస్తుందని అర్థం.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş