టాలీవుడ్ ఇలాంటి సంక్రాంతిని చూసి దశాబ్దం పైనే అయ్యింది. తెలుగు సినిమాకు ఎంత ప్రాముఖ్యం కలిగిన ఈ పండగ సీజన్ ఈసారి చాలా నీరసంగా గడిచిపోయింది. బంగార్రాజు లేకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది కానీ నాగార్జున ధైర్యం చేసి రిలీజ్ కు సిద్ధపడటం మంచిదయ్యింది. కాకపోతే రౌడీ బాయ్స్, హీరో ఆశించిన ఫలితాలను అందుకోలేకపోవడం నిరాశ పరిచింది. సూపర్ మచ్చి గురించి మాట్లాడుకోకపోవడం మంచిది. ఇప్పటిదాకా ఈ నాలుగు కలిసి 50 కోట్ల మార్కు అందుకోవడానికే […]