హీరోల వారసులు పరిచయమైనప్పుడు ఉన్నంత ఎగ్జైట్ మెంట్ హీరోయిన్ల కూతుళ్లు ఎంట్రీ ఇస్తున్నప్పుడు అంతగా ఉండదు. ఇది చాలా సార్లు ఋజువయ్యింది. ఒకప్పుడు చిరంజీవికి ధీటుగా డాన్సులేసి యువత మతులు పోగొట్టిన రాధ తన బిడ్డ కార్తీకను ఇండస్ట్రీ తీసుకొచ్చినా ప్రయోజనం కలగలేదు. జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్య లాంటి స్టార్ హీరోల సినిమాలు చేసినా లాభం లేకపోయింది. ఇప్పుడు భాగ్యశ్రీ వంతు వచ్చింది. 1989 బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ మైనే ప్యార్ కియా ద్వారా పరిచయమై […]