మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న లీగ్ మ్యాచ్లో భారత్ మహిళా జట్టు,బంగ్లా మహిళల జట్టుపై 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ గ్రూప్-A పట్టికలో 4 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.భారత్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన బంగ్లా జట్టుకు శుభారంభం లభించలేదు.ఓపెనర్ షమిమా (3)ను రెండో ఓవర్ చివరి బంతికి శిఖ పాండే ఔట్ చేసి తొలి దెబ్బ తీసింది.మరో ఓపెనర్ ముర్షిదా,సంజిదా (10)తో కలిసి […]