తొలి విడత పంచాయతీల పోలింగ్‌కు మరో గంటలు సమయం ఉన్న నేపథ్యంలో ఏకగ్రీవమైన పంచాయతీలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యధికంగా ఏకగ్రీవాలు జరిగాయన్న కారణంతో చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవమైన పంచాయతీలపై తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ డిక్లరేషన్ ప్రకటించొద్దని రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లను ఆయా పంచాయతీలపై సమగ్ర నివేదిక కోరారు. దీంతో చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవమైన 177 పంచాయతీల సర్పంచ్ […]
కరోనా వైరస్ నేపథ్యంలో ఉద్యోగుల ఆందోళనల, ఆవేదనల మధ్యనే ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు. అద్దాల ఫ్రేమ్ రక్షణ మధ్య, భౌతిక దూరం పాటిస్తూ ఈ రోజు ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. తాను చెప్పాలనుకుంది చెప్పి వెళ్లిపోవడంతో ఎన్నికలపై ప్రజల్లోనూ, అధికారుల్లోనూ నెలకొన్న అపోహలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. కరోనా వ్యాక్సిన్‌కు ఆటంకం కలిగేలా ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించాలన్న […]
అధికారంతో పాటే విధులు, బాధ్యతలు కూడా వర్తిస్తాయి. ఇది పౌరులకైనా, రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న అధికారికైనా వీటిని అనుసరించాల్సిందే. ఎక్కడైనా ఒకటి రెండు మినహాయింపులను సంబంధిత వ్యవస్థలు పట్టించుకోవడం లేదంటే.. సదరు వ్యక్తులు తమ విధుల పట్ల ప్రదర్శించిన నిబద్ధతే కారణం. అయితే ప్రతి అంశాన్ని గీసిగీసి బూతద్దంలో చూస్తే మాత్రం అన్ని వైపుల నుంచి ఆక్షేపణలు రావడం సర్వ సాధారణం. ముఖ్యంగా నేను పట్టిన కుందేటికి అన్నే కాళ్ళు అన్న రీతిలో వ్యవహిరంచే వారి పట్ల […]
వ్యక్తిగత ప్రతిష్ట, వ్యయ, ప్రయాసలకోర్చి పోయిన పదవిని కోర్టుల ద్వారా తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తాను పదవిలో ఉండగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తాజాగా జరుగుతున్న పరిణామాలతో అర్థం అవుతోంది. సోమవారం సుప్రిం కోర్టులో ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది.. స్థానిక సంస్థలను వాయిదా మాత్రమే వేశామని, నిరవదిక వాయిదా వేయలేదని, రద్దు చేయలేదని చెప్పడం ద్వారా.. ఇప్పటి వరకూ జరిగిన మండల, జిల్లా పరిషత్ ఎన్నికల […]