సరిగ్గా ఆరేళ్లు.. అంతలో ఎంత మార్పు..? మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో మారిన రాజకీయ ముఖచిత్రానికి అద్దంపడుతున్నాయి. 2014 సాధారణ ఎన్నికలకు ముందు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ డివిజన్లు, వార్డులను టీడీపీ గెలుచుకుంది. వైసీపీ కూడా తన పట్టును నిలుపుకుంది. కానీ తాజాగా జరిగిన ఎన్నికల్లో వార్ వన్సైడ్గా ఫలితాలు వచ్చాయి. వైసీపీ ధాటికి టీడీపీ ఎక్కడా నిలువలేకపోయింది. 2014లో అలా.. 2021లో ఇలా.. పోయిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 1,424 వార్డులు, డివిజన్లలో టీడీపీ […]