నగర మేయర్లు, మున్సిపల్ చైర్మన్ పోస్టులపై ఆశలు పెట్టుకుని, అవి అందకపోవడంతో నిరుత్సాహంలో ఉన్న ఆశానువాహులకు శుభవార్త. నగరపాలక సంస్థల్లో రెండో డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో రెండో వైస్ చైర్మన్ నియమించాలనే ప్రభుత్వ ఆలోచన కార్యరూపం దాల్చింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం పంపిన ఫైల్‌కు గవర్నర్ ఆమోద ముద్ర పడడంతో.. ఆర్డినెన్స్ జారీ అయింది. దీంతో ఇకపై కార్పొరేషన్లలో మేయర్‌తోపాటు ఇద్దరు డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో చైర్మన్‌తోపాటు ఇద్దరు వైస్ చైర్మన్లు […]