అన్ని కులాల్లో వెనుకబడిన ఉపకులాలకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రత్యేకంగా బీసీలకు అగ్రపీఠం వేస్తూ 1980 దశకంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ 1990 దశకం మధ్యనుండి పూర్తిగా కులముద్ర వేసుకుంది. ఆ పార్టీ రాజకీయాలు, వాటి మద్దతుదారులు ఒకే సామాజికవర్గం చుట్టూ తిరుగుతూ ఉండడంతో టిడిపిని ప్రజలు అలా ఓ కులం వైపు నెట్టేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ పార్టీని సమాజంలోని మిగతా అన్నికులాలు మరింత దూరం నెట్టేశాయి. దురదృష్టవశాత్తు ఇప్పుడు అమరావతిని మార్చాలని జగన్మోహన్ రెడ్డి […]
రాజధాని అమరావతి నిర్మాణం కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం సేకరించిన విరాళాల లెక్క తేలింది. అమరావతి నిర్మాణం కోసం 57 కోట్ల రూపాయాలు ప్రజలు విరాళంగా ఇచ్చారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అమరావతి పరిరక్షణ పోరాటం ఇటీవల రాజమహేంద్రవరంలో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు ఈ విషయం మొదటిసారిగా ప్రస్తావించారు. వివిధ రూపాల్లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసమంటూ విరాళాలు సేకరించింది. అమరావతి బ్రిక్స్ పేరుతో ఆన్లైన్లో ఇటుకల విక్రయాలు, ఎన్నారైలు విరాళాలు, సచివాలయంలో […]