తెలంగాణలో అయిదు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలు ఇప్పట్లో ఆగేలా లేవు. రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావారణ విభాగం తెలిపింది. ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, అసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, కొత్తగూడెం, వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మూడు రోజుల భారీ వర్షాలతో, విద్యాసంస్థలకు మూడు రోజుల సెలవులను పొడిగించారు. […]