పౌరసత్వం చట్ట సవరణ విషయంలో ప్రజల్లో అపోహలు అలజడి రేపుతున్నాయి. ఆందోళనలు మిన్నంటుతున్నాయి. దేశమంతా దద్దరిల్లుతోంది. అలాంటి సమయంలో పాలకులు ప్రతిపక్షాల మీద విరుచుకుపడే ప్రయత్నం పెద్దగా ఫలించే అవకాశం లేదు. తప్పిదాన్ని విపక్షాల మీదకు నెట్టాలని చూడడం అన్ని వేళలా ఉపయోగపడదు. అయినా కేంద్ర ప్రభుత్వ పెద్దలు అదే ప్రయత్నం చేశారు. అయినా ప్రజల్లో అగ్రహం చల్లారకపోవడంతో చివరకు ప్రధానమంత్రి ఢిల్లీ వేదికగా ప్రకటన చేస్తూ ఎన్నార్సీ గురించి తాము ఎన్నడూ ఆలోచించలేదని పేర్కొన్నారు. ఇది […]