ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం మరోసారి మొదటికొచ్చింది. గడిచిన శతాబ్దకాలంలోనే మద్రాస్ నుంచి కర్నూలుకి, అక్కడి నుంచి హైదరాబాద్ కి, మళ్లీ అమరావతి నుంచి ఇప్పుడు వైజాగ్ వైపు వెళుతోంది. మద్రాస్ తీరం నుంచి ఇప్పుడు విశాఖ తీరం వరకూ సాగుతున్న ఏపీ రాజధాని పయనంలో అనేక మలుపులున్నాయి. కానీ ఇప్పుడు తాజాగా వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన మూడు రాజధానులు, నాలుగు రీజియన్ల వ్యవహారం ఆసక్తిగా కనిపిస్తోంది. అమరావతి పరిస్థితి ఏమిటన్నది కొందరి సమస్యగా కనిపిస్తున్నప్పటికీ, ఏపీలో […]