రాజధాని అమరావతి నిర్మాణం కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం సేకరించిన విరాళాల లెక్క తేలింది. అమరావతి నిర్మాణం కోసం 57 కోట్ల రూపాయాలు ప్రజలు విరాళంగా ఇచ్చారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అమరావతి పరిరక్షణ పోరాటం ఇటీవల రాజమహేంద్రవరంలో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు ఈ విషయం మొదటిసారిగా ప్రస్తావించారు. వివిధ రూపాల్లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసమంటూ విరాళాలు సేకరించింది. అమరావతి బ్రిక్స్ పేరుతో ఆన్లైన్లో ఇటుకల విక్రయాలు, ఎన్నారైలు విరాళాలు, సచివాలయంలో […]